న్యూఢిల్లీ: బీహార్(Bihar)లో ఎన్డీఏ కూటమి మధ్య సీట్ల పంపకంపై డీల్ కుదిరింది. ఆ రాష్ట్రంలో లోక్సభ(Lok Sabha Polls)కు బీజేపీ 17 స్థానాల నుంచి పోటీ చేయనున్నది. ఇక జేడీయూ 16 స్థానాలు, ఎల్జేపీ 5 స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. హిందుస్తానీ అవామీ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీలు ఒక్కొక్క సీటు నుంచి పోటీ చేయనున్నట్లు బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్ తవడే తెలిపారు. హజిపూర్ లోక్సభ స్థానాన్ని చిరాగ్ పాశ్వాన్ పార్టీకి కేటాయించినట్లు ఆయన చెప్పారు.
#WATCH | NDA seat sharing in Bihar: BJP National General Secretary Vinod Tawde says, “BJP will contest on 17 seats, JDU on 16 seats, LJP (Ram Vilas) on 5 seats, Hindustani Awam Morcha and Rashtriya Lok Morcha on one seat each…” pic.twitter.com/s1TpdoQBza
— ANI (@ANI) March 18, 2024