హర్యానాలోని వాళ్ల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఢిల్లీకి యమునా నది నీటి సరఫరాను బంద్ చేసి బీజేపీ ‘కొత్త కుట్ర’కు తెర లేపింది. ఆప్ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు, ఢిల్లీ ప్రజలను ఇబ్బందులకు గురిచేసేందుకు బీజేపీ ఇలా చేస్తున్నది. లోక్‌సభ ఎన్నికల ప్రకటన వచ్చిన నాటి నుంచి ఆప్, కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా బీజేపీ పలురకాలుగా కుట్రలు పన్నుతున్నది. కేజ్రీవాల్ అరెస్టు, స్వాతి మలివాల్ అంశం, ఆప్‌నకు విదేశీ విరాళాల ఆరోపణలు అందులో భాగమే.
– ఆతిశీ, ఆప్ నేత, ఢిల్లీ మంత్రి
ఆప్ ప్రభుత్వ అవినీతి, ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఢిల్లీలో నీటి కొరత సమస్య తలెత్తింది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి భయంతో ఆప్ కొత్త అబద్ధపు ప్రచారాన్ని ప్రారంభించింది. మేము నీటి సమస్య అంశాన్ని సోమవారం లేవనెత్తినప్పుడు.. మంత్రి ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఇప్పుడు బీజేపీపై నిందలు వేస్తున్నారు. నీటి కొరత సమస్యపై కేజ్రీవాల్ రాసిన లేఖకు సంబంధించి, మంత్రి గత నెల రోజులుగా ఏం చర్యలు తీసుకొన్నారు?
-వీరేంద్ర సచ్దేవ, బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు