Loksabha Polls 2024 : శివుడు, రాముడిని ఉద్దేశించి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ నేతలకు తొలి నుంచీ రాముడి పట్ల శత్రుభావం ఉందని మండిపడ్డారు. ఖర్గే ప్రకటనపై బీజేపీ జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా స్పందించారు. ఖర్గేను రిమోట్ కంట్రోల్ అధ్యక్షుడని పిలుస్తారని ఎద్దేవా చేశారు.
రిమోట్ కంట్రోల్‌కు రెండు బ్యాటరీలు అవసరమని, ఖర్గేకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బ్యాటరీలని వ్యాఖ్యానించారు. ఓ బ్యాటరీని తొలగిస్తే రిమోట్ కంట్రోల్ అధ్యక్షుడు ఒక్క మాట కూడా మాట్లాడలేరని అన్నారు. వేదికపై తాను మాట్లాడాలా లేదా అనే దానిపై ఖర్గే వారి అనుమతి తీసుకుంటారని వ్యాఖ్యానించారు. ఖర్గే మాట్లాడితే విద్వేషం, విషం చిమ్ముతారని గౌరవ్ భాటియా పేర్కొన్నారు.
కాగా ఛత్తీస్‌ఘఢ్‌లో మంగళవారం లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్ధి శివకుమార్ దహరియకు మద్దతుగా ఖర్గే మాట్లాడుతూ దహరియాను శివుడితో పోల్చారు. తాను శివుడు అయినందుకు దహరియా రాముడితో కూడా పోరాడాలని అన్నారు. తన పేరు మల్లికార్జున అని అంటే తాను కూడా శివుడినేనని చెప్పారు. ఏపీలోని శ్రీశైలంలో మల్లికార్జున పేరుతో జ్యోతిర్లింగం ఉందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు.
Read More :