భోపాల్: బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్లో పారామెడికల్ విద్య అక్రమాల పుట్టగా మారింది. ఎన్డీటీవీ కథనం ప్రకారం, ల్యాబ్ టెక్నీషియన్లు, రేడియాలజీ సిబ్బంది, ఫిజియోథెరపిస్టులు, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్లు వంటివారిని తయారు చేసి, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు వెన్నెముకను అందించవలసిన పారా మెడికల్ విద్యా రంగం దయనీయ స్థితిలో ఉంది. తరగతి గదులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
ప్రయోగశాలలకు తాళాలు పడ్డాయి, పరీక్షల నిర్వహణ ఆలస్యమవుతున్నది. పాత తేదీలతో గుర్తింపునిస్తున్నారు, ఫలితాల ప్రకటన నిరవధిక వాయిదా వల్ల విద్యార్థుల జీవితాలు అనేక సంవత్సరాలు దెబ్బతింటున్నాయి., 2020 నుంచి ఈ పరిస్థితి కొనసాగుతున్నది. పరిస్థితి ఎంతగా క్షీణించిందంటే, 2025 బ్యాచ్ అడ్మిషన్లు ఇప్పటికీ పూర్తి కాలేదు. మధ్య ప్రదేశ్లో 243కుపైగా పారామెడికల్ ఇన్స్టిట్యూషన్లు పని చేస్తున్నాయి.