AAP : దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) ఆదివారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ, ఆ పార్టీ నేత రాంవీర్ సింగ్ బిధూరీల సమక్షంలో పలువురు ఆప్ కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. ఆప్ అవినీతిలో కూరుకుపోవడంతో దిక్కుతోచని స్ధితిలో కాషాయ పార్టీలో చేరాలని వారు నిర్ణయించుకున్నారని వీరేంద్ర సచ్దేవ పేర్కొన్నారు.
ఆప్ అవినీతిలో కూరుకుపోవడంతో పాటు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో విసిగిన ఐదుగురు ఆప్ కౌన్సిలర్లు ఆ పార్టీని వీడి కాషాయ తీర్ధం పుచ్చుకున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి పధంలో నిలపడంతో పాటు ప్రతిఒక్కరూ పురోగమించేలా దశదిశ నిర్ధేశించడంతో వారంతా బీజేపీకి ఆకర్షితులయ్యారని చెప్పారు.
ఢిల్లీ అభివృద్ధి పట్ల తమకు చిత్తశుద్ధి ఉందని, ఆప్ నుంచి బీజేపీలో చేరిన వారందరినీ పార్టీలోకి స్వాగతిస్తున్నామని తెలిపారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా ఆ పార్టీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అగ్రనేతలు ఎక్సైజ్ స్కామ్ సహా పలు అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయారని అన్నారు.ఢిల్లీలో పాలక ఆప్ అవినీతి పాలన పట్ల ప్రజలు విసిగి వేసారారని అన్నారు.
Read More :
Karnataka | పీకల్లోతు కేసుల్లో సీఎం సిద్ధూ.. కర్ణాటక కాంగ్రెస్లో వేగంగా మారుతున్న పరిణామాలు!