మైసూర్: బీజేపీపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. తన ప్రభుత్వాన్ని గద్దె దించడానికి బీజేపీ ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టిందని ఆరోపించారు. దానికి తమ ఎమ్మెల్యేలు ఎవరూ ఒప్పుకోకపోవడంతో బీజేపీ తనను అప్రతిష్ఠపాలు చేయడానికి తప్పుడు ఆరోపణలు చేసి కేసులు బనాయిస్తున్నదని విమర్శించారు.
టీ నర్సిపుర నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను బుధవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇస్తానని బీజేపీ అందని, అసలు అంత సొమ్ము వారికి ఎక్కడి నుంచి వస్తున్నదని ప్రశ్నించారు. వారు డబ్బునేమన్నా ప్రింట్ చేస్తున్నారా? అని ప్రశ్నించారు.