న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో ఇవాళ బీజేపీ, ఇండియా కూటమి నేతల మధ్య తోపులాట జరిగింది. ఆ ఘటనలో బీజేపీ ఎంపీలు గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే బీజేపీ ఎంపీలు నెట్టివేయడం వల్ల.. తాను కూడా కింద కూలినట్లు కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లిఖార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. బీజేపీ ఎంపీలు మకర ద్వారం వద్ద తనపై భౌతిక దాడి చేసినట్లు ఆరోపించారు. ఆ సమయంలో తన మోకాళ్లకు గాయమైనట్లు పేర్కొన్నారు. ఆ ఘటన పట్ల దర్యాప్తు చేపట్టాలని ఆయన స్పీకర్ను కోరారు.
My letter to the Hon’ble @loksabhaspeaker urging to order an inquiry into the incident which is an assault not just on me personally, but on the Leader of the Opposition, Rajya Sabha and the Congress President. pic.twitter.com/gmILQdIDYW
— Mallikarjun Kharge (@kharge) December 19, 2024