న్యూఢిల్లీ, జూలై 29: రాజ్యాంగం నుంచి ‘ఇండియా’ అనే పదాన్ని తొలగించాలని రాజస్థాన్ బీజేపీ రాజ్యసభ సభ్యుడు నరేశ్ బన్సల్ డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘ఇండియా’ పదాన్ని భారత రాజ్యాంగం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదనను పార్లమెంట్ ముందు ఉంచడం విమర్శలకు దారి తీసింది. పతిపక్షాల కూటమికి ఇండియా అని ఇటీవల పేరు పెట్టగా… ఓ బీజేపీ నేత ఈ పతిపాదనను తెరపైకి తీసుకురావడం గమనార్హం.