న్యూఢిల్లీ : ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరస్ధాయికి చేరడంతో దేశ రాజధానిలో వాహన రాకపోకల నియంత్రణకు మళ్లీ సరి-బేసి విధానం అమలు చేయడం వివాదాస్పదమైంది. దీపావళికి ముందు ఈ నిబంధనను ముందుకు తీసుకురావడం సనాతన ధర్మంపై (Sanatana Dharma) సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుట్రేనని బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి మంగళవారం విరుచుకుపడ్డారు.
ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌ను అర్బన్ నక్సలైట్‌గా కాషాయ పార్టీ నేత అభివర్ణించారు. దివాళీ రోజు ప్రజలు ఒకరినొకరు కలుసుకోకూడదనే ఉద్దేశంతో కేజ్రీవాల్ కుట్రపూరితంగా సనాతన ధర్మంపై దాడికి తెగబడ్డారని ఆరోపించారు. దేశాన్ని నాశనం చేసేందుకు కేజ్రీవాల్ విదేశీ శక్తులతో చేతులు కలిపారని దుయ్యబట్టారు. కేజ్రీవాల్ వంటి నేతల కారణంగా భారత సంస్కృతి కనుమరుగవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
దివాళీ రోజు బాణాసంచాను ఢిల్లీ సీఎం నిషేధించడాన్ని ఆయన తప్పుపట్టారు. విదేశీయుల నుంచి డబ్బులు తీసుకుని ఆప్ నేతలు మన పండగలపై నిషేధం విధిస్తున్నారని బీజేపీ ఎంపీ మండిపడ్డారు. లౌకిక మేధావులుగాఆ చెప్పుకుంటున్న కేజ్రీవాల్ వంటి వారు కాలుష్యాన్ని నివారించేందుకు సరైన పరిష్కార మార్గాన్ని అన్వేషించాలని హితవు పలికారు.
Read More :
Mizoram Assembly Elections: మిజోరంలో ఓటేసిన 101 ఏళ్ల వృద్ధుడు.. 96 ఏళ్ల అంధుడు