న్యూఢిల్లీ(నమస్తే తెలంగాణ): బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌కు ఢిల్లీలో నిరసన సెగ తగిలింది. మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై బాధిత కుటుంబ సభ్యులు ఆయన్ను నిలదీశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఎంపీ లక్ష్మణ్‌కు వారు తమ గోడును వినిపించారు. అల్లర్లపై మౌనం వహిస్తున్న బీజేపీ వైఖరిపై ప్రశ్నించారు.
మణిపూర్ అల్లర్లపై తక్షణమే పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫ్లకార్డులతో కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ప్రధానంగా క్రిస్టియన్ సామాజికవర్గాలే లక్ష్యంగా జరుగుతున్న దాడులను నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేషనల్ క్రిస్టియన్ బోర్డు చైర్మన్ జాన్ మస్క్ ఆధ్వర్యంలో దాదాపు 30 మందికిపైగా మణిపూర్ బాధితులు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.