న్యూఢిల్లీ: లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ఏడుసార్లు వరుసగా నెగ్గిన బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ను ఎన్నిక చేసినట్టు బీజేపీ చేసిన ప్రకటన ఇండియా కూటమికి ఆగ్రహం తెప్పించింది. అత్యంత సీనియర్ అయిన కాంగ్రెస్ ఎంపీ సురేశ్‌కు ఆ పదవి ఇవ్వకపోవడాన్ని నిరసించింది. దళితుడైన కారణంగానే ఆయనను ఆ పదవికి దూరం పెట్టారని ఆరోపించింది.
దీనిపై కూటమి పార్టీలతో చర్చించి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ప్రొటెం స్పీకర్‌కు సహాయపడే ప్యానల్లో సురేశ్, డీఎంకే ఎంపీ బాలు, టీఎంసీ ఎంపీ బందోపాధ్యాయ సభ్యులుగా ఉండరని స్పష్టం చేసింది. కాగా మహతాబ్ ఎన్నికను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజ్ సమర్థించుకున్నారు.