బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ వరద కాలువ పనుల్లో 15 శాతం కమీషన్ వసూలు చేశారని బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని సంస్థలకు కాంట్రాక్టులను కట్టబెట్టారని తెలిపారు. ఈ పనుల కోసం ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి రూ.2,000 కోట్ల రుణం తీసుకుంటున్నదని చెప్పారు.
తాను మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని తెలిపారు. ఆయన ఆదివారం గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ను కలిసి ఈ అవినీతిపై దర్యాప్తు జరిపించాలని కోరారు. టెండర్ల ప్రక్రియలో అక్రమాల గురించి ఆయన గతంలో లోకాయుక్త, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐలకు కూడా ఫిర్యాదు చేశారు.