పాట్నా: అమ్మాయిలను తాకిన దుర్మార్గుల చేతులు నరకాలని బీజేపీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. విజయదశమి సందర్భంగా బాలికలకు కత్తులను ఆయన పంపిణీ చేశారు. (BJP MLA Distributes Swords ) అలాగే పలు దుర్గా పూజా మండపాల వద్ద కూడా కత్తులను పంచారు. బీహార్లోని సీతామర్హి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం విజయదశమి వేడుకల సందర్భంగా సీతామర్హి నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే మిథిలేష్ కుమార్ ఒక దుర్గా మాతా పూజా మండపం వద్ద ఆయుధాలు, గన్స్, కత్తులకు ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజీ, స్కూల్ బాలికలకు కత్తులను ఆయన పంపిణీ చేశారు.
కాగా, ఎవరైనా దుర్మార్గులు మన సోదరీమణులను తాకడానికి ధైర్యం చేస్తే వారి చేతులను ఈ కత్తితో నరకాలని బీజేపీ ఎమ్మెల్యే మిథిలేష్ కుమార్ పిలుపునిచ్చారు. ‘దుర్మార్గుల చేతులు నరికే సామర్థ్యాన్ని మన సోదరీమణులు కలిగి ఉండాలి. అవసరమైతే, నేను, మీరంతా దీనిని చేయాలి. మన సోదరీమణులపై చెడు ఉద్దేశం ఉన్న దుర్మార్గులందరినీ నాశనం చేయాలి’ అని అన్నారు. ఈ దిశగా తాను చేస్తున్న చొరవకు ప్రజలు మద్దతు ఇవ్వాలని, మహిళలను ప్రోత్సహించాలని ఆయన కోరారు.
మరోవైపు నవరాత్రుల సందర్భంగా పలు దుర్గా మాతా పూజా మండపాలను బీజేపీ ఎమ్మెల్యే మిథిలేష్ కుమార్ సందర్శించారు. రామాయణం పుస్తకంతోపాటు కత్తులను పలువురికి పంపిణీ చేశారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో బీజేపీ ఎమ్మెల్యే తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
फिर सुर्खियों में #Sitamarhi #BJP विधायक Mithlesh Kumar.#Vijayadashami पर लड़कियों के बीच बांटी तलवार.#HappyDussehra #विजयादशमी #Vijayadashami #Ravana pic.twitter.com/aF52z0dHS9
— News18 Bihar (@News18Bihar) October 12, 2024
BJP MLA Mithilesh Kumar openly distributes swords & Ramayana in Bihar
Had a Muslim MP/MLA done the same,they’d be slapped with UAPA,NSA & have their home bulldozed
Hypocrisy is glaring
Is this the justice we stand for
Why no action despite lawmaker openly advocating violence pic.twitter.com/tHJ9zxqKHM— Hariprasad.B.K. (@HariprasadBK2) October 10, 2024