అకోల: మహారాష్ట్రలోని అకోలా జిల్లా అకోట్లో బీజేపీ, ఏఐఎంఐఎం మధ్య వివాదాస్పద పొత్తు మరోసారి కొత్తరూపంలో బయటపడింది. 35 మంది కౌన్సిలర్లతో కూడిన అకోట్ మున్సిపల్ కౌన్సిల్లో మెజారిటీ కోసం కొద్ది రోజుల క్రితం అకోట్ వికాస్ మంచ్ పేరిట బీజేపీ, ఎంఐఎం ఓ కూటమిని ఏర్పాటు చేయగా సర్వత్రా విమర్శలు వచ్చాయి.
ఇప్పుడు అకోట్ మున్సిపల్ కౌన్సిల్లో కో-ఆప్టెట్(నామినేటెడ్) సభ్యుల ఎంపిక సందర్భంగా ఈ రెండు పార్టీల మధ్య మరోసారి వేరే రూపంలో పొత్తు కుదిరింది. కో-ఆప్టెట్ కార్పొరేటర్ సీటు కోసం మాజీ బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు రామచంద్ర బరేథియా కుమారుడు జితేశ్ బరేథియాకు కౌన్సిల్లోని ఐదుగురు ఎంఐఎం కార్పొరేటర్లు మద్దతు పలకడం వివాదాస్పదమైంది.
ఈ పరిణామంపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆత్మవంచనకు పాల్పడుతున్నదని ఆరోపించింది. బీజేపీ, ఎంఐఎం ఒకే నాణేనికి రెండు ముఖాలుగా కాంగ్రెస్ ఆరోపించింది.