న్యూఢిల్లీ: చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారులకు, బీజేపీ నేతలకు మధ్య 2008 తర్వాత 12 సమావేశాలు జరిగాయని, వాటి వివరాల్ని బయటపెట్టాలని కాంగ్రెస్ సోమవారం డిమాండ్ చేసింది. ‘చాలావరకు సమావేశాలు చైనాలో జరిగాయి.
లఢక్ ఘర్షణల తర్వాత ప్రధాని మోదీ చైనాకు క్లిన్చిట్ ఇచ్చారు. చైనాకు దీటుగా ఎదురునిలవడానికి బీజేపీ ఎందుకు ఇష్టపడటం లేదన్నది భారత ప్రజలు అడుగుతున్నారు. ఇరు పార్టీల మధ్య సన్నిహిత సంబంధాలే దీనికి కారణమా?’ అని కాంగ్రెస్ ప్రశ్నించింది.