Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ఉత్కంఠకు మరో రెండు రోజుల్లో తెరపడనున్నట్లు తెలిసింది. ఢిల్లీకి కాబోయే నూతన ముఖ్యమంత్రిని ఈనెల 19న బీజేపీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఇవాళ నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇటీవలే ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలలో 15 మంది పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు సమాచారం. అందులోంచి తొమ్మిది మందిని మంత్రివర్గం, స్పీకర్ పదవికి ఎంపిక చేయనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. ఈనెల 20న సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని పేర్కొన్నాయి.
27 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ (BJP) అత్యధిక సీట్లు గెలిచి అధికారాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 48 స్థానాల్లో గెలిచింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో హస్తినలో ప్రభుత్వ ఏర్పాటుకు కమలం పార్టీ సిద్ధమవుతోంది.
కమలం పార్టీ అధికారికంగా సీఎం పేరు ప్రకటించనప్పటికీ, ఈ రేసులో ముందంజలో ఉన్న పలువురి పేర్లు ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఆప్ చీఫ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ (Parvesh Verma) ముందంజలో ఉన్నారు. ఢిల్లీ మేయర్‌గా పనిచేసిన రేఖా గుప్తా పేరు కూడా పార్టీ వర్గాల్లో ఎక్కువగా వినపడుతున్నది. ప్రస్తుత బీజేపీలో ఎవరూ మహిళా సీఎం లేకపోవటం ఆమెకు కలిసివచ్చే అంశమని చెబుతున్నారు. దివంగత సుష్మా స్వారజ్ కుమార్తె బన్పూరి స్వరాజ్, స్మృతి ఇరానీ పేర్లు కూడా రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
Also Read..
Maha Kumbh | కుంభమేళాలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 53 కోట్ల మంది పుణ్యస్నానాలు
Delhi | ఢిల్లీలో భూకంపం.. ఉలిక్కిపడ్డ జనం, ఇండ్ల నుంచి బయటకు పరుగులు
PM Modi | మరోసారి భూప్రకంపనలు వచ్చే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని మోదీ