PM Modi | మరోసారి భూప్రకంపనలు వచ్చే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని మోదీ
సోమవారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీనిపై ప్రధాని మోదీ (PM Modi) స్పందిస్తూ.. మరోసారి భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
ఢిల్లీ: సోమవారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీనిపై ప్రధాని మోదీ (PM Modi) స్పందిస్తూ.. మరోసారి భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎలాంటి భయాందోళనకు గురవకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Tremors were felt in Delhi and nearby areas. Urging everyone to stay calm and follow safety precautions, staying alert for possible aftershocks. Authorities are keeping a close watch on the situation.
— Narendra Modi (@narendramodi) February 17, 2025
ఉదయం 5.36 గంటలకు ఢిల్లీతోపాటు గురుగ్రామ్, నోయిడాలో భూకంపం వచ్చింది. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదయింది. తెల్లవారుజామున 5 నుంచి 8 సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులుపెట్టారు. అంతకుముందు బంగాళాఖాతంలో కూడా భూమి కంపించింది. ఆదివారం రాత్రి 11.16 గంటలకు 4.3 తీవ్రతతో భూకంపం వచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

