(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలిత రాష్ర్టాలు నేరాలకు అడ్డాగా మారుతున్నాయి. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, దాడులు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఇలా పలు రకాల హింసాత్మక ఘటనలతో ఆయా రాష్ర్టాల్లో శాంతి-భద్రతలు ప్రశ్నార్థకంగా మారాయి. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ)-2024 నివేదిక ప్రకారం.. తలసరి నేరాల్లో టాప్-10 రాష్ర్టాల జాబితాను తీస్తే, తొమ్మిది రాష్ర్టాల్లో ఎన్డీయేనే అధికారంలో ఉండటం గమనార్హం. ఈ మేరకు ఇంగ్లీష్ వెబ్సైట్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఓ కథనంలో వెల్లడించింది.
జనాభా పరంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. నేరాల్లోనూ అగ్రస్థానమే. బీజేపీ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఒక్కొక్కరిపై సగటున 7.4 నేరాలు (పర్‌క్యాపిటా క్రైమ్) ఉన్నట్టు నివేదికను బట్టి అర్థమవుతున్నది. నేరాల జాబితాలో అధికంగా దొంగతనాలు, హింసాత్మక దాడులు, మత ఘర్షణలు ఉన్నాయి.
బీజేపీ అధికారంలో ఉంది. తలసరి నేరాలు 5.8గా రికార్డయ్యాయి. నేరాలు పెరిగిపోవడంతో రాత్రిళ్లు బయట తిరగడాన్ని కొన్ని ప్రాంతాల్లో నిషేధించారు.
ఇండియా కూటమిలోని జేఎమ్ఎమ్ అధికారంలో ఉన్నది. తలసరి నేరాలు 5.3గా నమోదయ్యాయి. మావోయిస్టుల దాడులు, మైనింగ్ మాఫియా నేరాలకు ప్రధాన కారణంగా చెప్తున్నారు.
ఎన్డీయే మిత్రపక్షం నేషనల్ పీపుల్స్ పార్టీ అధికారంలో ఉన్నది. తలసరి నేరాలు 5.1గా రికార్డయ్యాయి. గిరిజన ప్రాంతాల్లో తరుచూ అల్లర్లు జరుగుతున్నాయి.
బీజేపీ అధికారంలో ఉన్నది. తలసరి నేరాలు 5గా నమోదయ్యాయి. రేప్‌లు, స్థానికంగా దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి.
బీజేపీ అధికారంలో ఉన్నది. తలసరి నేరాలు 4.4గా రికార్డయ్యాయి. రాజకీయ అస్థిరత్వంతో నేరాలు పెరిగిపోయాయి. జాతుల మధ్య వైరుధ్యం, భూ తగాదాలు ఎక్కువగా జరుగుతాయి.
బీజేపీ అధికారంలో ఉన్నది. తలసరి నేరాలు 4గా నమోదయ్యాయి. మావోయిస్టుల ప్రాబల్యం, గిరిజన ప్రాంతాల్లో హింస ఎక్కువగా ఉంటుంది. పోలీసు వ్యవస్థ స్థానికంగా పటిష్ఠంగా లేదన్న వాదనలు ఉన్నాయి.
బీజేపీ అధికారంలో ఉన్నది. తలసరి నేరాలు 3.8గా రికార్డయ్యాయి. వ్యవస్థీకృత నేరాలు అధికంగా ఉన్నాయి.
బీజేపీ అధికారంలో ఉన్నది. తలసరి నేరాలు 3.8గా నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో లైంగిక వేధింపులు, హత్యలు, భూతగాదాల వంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ఎన్డీయే మిత్రపక్షం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది. తలసరి నేరాలు 3.6గా రికార్డయ్యాయి. గృహహింస, సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి.