న్యూఢిల్లీ: లఢక్‌లో 4,064 చదర పు కిలోమీటర్ల భూ భాగాన్ని చైనా ఆక్రమించిందని, దీనిపై నిజాలు వెలికితీయడానికి ప్రయత్నిస్తున్న తనను కోర్టులో మోదీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటున్నదని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ ఈ విషయంలో కాంగ్రెస్ నోరెత్తదని, ఎందుకంటే అది చైనాతో ఒప్పందం కుదుర్చుకుందని అంటూ.. మోదీ కూడా చై నాతో అలాంటి ఒప్పందం కుదుర్చుకున్నారా? అని ప్రశ్నించారు. భారత భూభాగంలో చైనా ఆక్రమణల వివరాలను అందించడంలో అధికారులు విఫలమయ్యారని, దీనిపై పూర్తి వివరాలు అందజేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ 2023 అక్టోబర్ 9న ఆయ న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.