బెంగళూరు: బీజేపీ నేత, పోలీస్ అధికారి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. దీంతో వారిద్దరూ ఫైట్ చేసుకున్నారు. చెంపలపై కొట్టుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Slap Fight) కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి వేళ దుర్గాడ సిరి హోటల్ రోడ్ వద్ద కొందరు వ్యక్తులు గుమిగూడారు.
కాగా, వాహనంలో అటుగా వెళ్తున్న పోలీసులు వీరిని చూశారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఎస్ఐ గాడిలింగ గౌడర్ వారికి చెప్పారు. మధుగిరి బీజేపీ జిల్లా అధ్యక్షుడు హనుమంత గౌడ దీనిపై ఆగ్రహించారు. ఆ పోలీస్‌పై దుర్భాషలాడారు. చేయి చేసుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ నేత చెంపపై ఆ పోలీస్ అధికారి కొట్టారు. హనుమంత గౌడ తిరిగి కొట్టగా వారి మధ్య గొడవ ముదిరింది.
మరోవైపు బీజేపీ నేతను, పోలీస్ అధికారిని విడిపించేందుకు పోలీస్ సిబ్బంది, అక్కడున్న వారు ప్రయత్నించారు. ఈ ఘర్షణ తర్వాత ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదయ్యాయి. బీజేపీ నేత హనుమంత గౌడ, పోలీస్ అధికారి గాడిలింగ గౌడర్ మధ్య అర్ధరాత్రి వేళ జరిగిన ఫైట్‌కు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
An incident of assault on PSI (Police Sub-Inspector) #Gadhilingappa, who questioned a group of people standing on the road late at night, has occurred near a private hotel in #Karnataka‘s #Chitradurga.
Hanumantegowda, the #BJP District President of #Madhugiri, and his team were… pic.twitter.com/U7PEMzuJD3
— Hate Detector 🔍 (@HateDetectors) March 15, 2025