చెన్నై, సెప్టెంబర్ 18 : కేంద్రంలోని అధికార బీజేపీకి తమిళనాడులో ప్రవేశం లేదని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. హిందీ భాషను బలవంతంగా రుద్దుతూ, రాష్ర్టానికి రావాల్సిన విద్యా నిధులు రాకుండా కేంద్రంలోని అధికార బీజేపీ అడ్డుకుంటున్నదని ఆరోపించారు.
గురువారం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం, డీఎంకే వ్యవస్థాపకులు పెరియార్, అన్నాదురైల జయంతిని పురస్కరించుకొని ‘కరూర్’లో నిర్వహించిన భారీ సభను ఉద్దేశించి స్టాలిన్ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఇటు బీజేపీ, అటు ఏఐఏడీఎంకే నాయకత్వానికి రాజకీయ సవాల్ విసిరారు. తమిళనాడు గుర్తింపును, హక్కులు, తమిళ భాషను కాపాడుకుంటామని, కేంద్రం ముంగిట తమిళనాడు ఎన్నడూ తలవంచబోదని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.