పాట్నా, జూన్ 20: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. ఈ కేసులో అరస్టైన ప్రధాన నిందితుడు సికందర్ ప్రసాద్ యద్వేందుకు తేజస్వీ సహచరులతో సన్నిహిత సంబంధాల ఉన్నాయని బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
తేజస్వీ సన్నిహితులు సికందర్ ప్రసాద్‌తో నిరంతరం సంప్రదింపులు చేశారని, ఇందుకు సంబంధించిన సందేశాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సి ఉన్నదన్నారు.