కోల్‌కతా, మే 11: పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఏర్పడిన సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ సర్కార్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) మనోజ్ అగర్వాల్‌ను సోమవారం నియమించింది. పశ్చిమ బెంగాల్ క్యాడర్‌కు చెందిన 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అగర్వాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)కు సారథ్యం వహించారు.
ఓటరు జాబితా నుంచి దాదాపు 91 లక్షల ఓటర్ల పేర్లు ‘సర్’ ద్వారా తొలగించారు. కాగా, ఇప్పటివరకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన దుష్యంత నరియల న్యూఢిల్లీలో ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా నియమితులైనట్లు ప్రభుత్వ ఉత్తర్వు పేర్కొన్నది.