Loksabha Elections 2024 : యూపీలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్‌తో కూడిన విపక్ష ఇండియా కూటమి నుంచి కాషాయ పార్టీ చిత్తుగా ఓడించింది.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టడంతో ఈసారి 400 లోక్‌సభ స్ధానాలు సాధిస్తామనే నినాదంతో హోరెత్తించిన కాషాయ పార్టీకి స్వయంగా అయోధ్యలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయోధ్య ఫైజాబాద్ లోక్‌సభ స్దానం పరిధిలో ఉండగా ఈ స్ధానంలో ఎస్పీ అభ్యర్ధి విజయం సాధించారు.
బీజేపీ అభ్యర్ధి లల్లూ సింగ్‌పై ఎస్పీ అభ్యర్ధి అవధేష్ ప్రసాద్ 54,567 ఓట్లతో విజయం సాధించారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 296 స్దానాల్లో ఆధిక్యంలో ఉండగా విపక్ష ఇండియా కూటమి 229 స్ధానాల్లో గెలుపు దిశగా సాగుతుండగా ఇతరులు 18 స్ధానాల్లో ముందంజలో ఉన్నారు.
Read More :
DK Aruna | మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ విజయం.. సీఎం సొంత జిల్లాలో రేవంత్‌కు భారీ షాక్..!