మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Oct 24, 2020 , 13:32:32

ముఫ్తీపై దేశ‌ద్రోహం కేసుకు బీజేపీ డిమాండ్‌

ముఫ్తీపై దేశ‌ద్రోహం కేసుకు బీజేపీ డిమాండ్‌

శ్రీన‌గ‌ర్ : జమ్ము‌క‌శ్మీ‌ర్‌కు ప్రత్యేక ప్రతి‌ప‌త్తిని పున‌రు‌ద్ధ‌రిం‌చేంత వరకు ఎన్ని‌కల్లో పోటీ‌చే‌య‌బో‌మని, జాతీయ జెండాను చేబ‌ట్ట‌బో‌మని ఆ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి, పీడీపీ అధి‌నా‌య‌కు‌రాలు మెహ‌బూబా ముఫ్తీ స్పష్టం‌చే‌శారు. 14 నెలల నిర్బంధం నుంచి ఇటీ‌వల విడు‌ద‌లైన ఆమె.. శుక్ర‌వారం తొలి‌సా‌రిగా మీడి‌యాతో మాట్లా‌డారు. జమ్ము‌క‌శ్మీర్‌ జెండాను పున‌రు‌ద్ధ‌రిం‌చిన తర్వాతే త్రివర్ణ పతా‌కాన్ని చేబ‌డ‌తా‌మని చెప్పారు.

ముఫ్తీ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశాయి. ఆమె వ్యాఖ్య‌లు దేశ ప్ర‌యోజ‌నాల‌కు వ్య‌తిరేకంగా ఉన్నాయ‌ని బీజేపీ ఆరోపించింది. ముఫ్తీపై దేశ ద్రోహం కేసు న‌మోదు చేసి అరెస్టు చేయాల‌ని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ భూమిపై ఏ శ‌క్తి జ‌మ్మూక‌శ్మీర్‌లో తిరిగి ప్ర‌త్యేక జెండాను ఎగుర‌వేయలేద‌ని వ్యాఖ్యానించింది. ముప్తీ వ్యాఖ్య‌ల‌ను గ‌వ‌ర్న‌ర్ తీవ్రంగా ప‌రిగ‌ణించాలని బీజేపీ జ‌మ్మూక‌శ్మీర్ అధ్య‌క్షుడు ర‌వీందర్ రైనా కోరారు. రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌ల‌ను ముఫ్తీ మానుకోవాల‌ని చెప్పారు. లేని ప‌క్షంలో భ‌విష్య‌త్‌లో జ‌ర‌గబోయే ప‌రిణామాల‌కు బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. 

ముఫ్తీ వ్యాఖ్య‌లు ఆమోద‌నీయం కాద‌న్న కాంగ్రెస్.. త్రివ‌ర్ణ ప‌తాకం భార‌తీయుల ఐక్య‌త‌, స‌మ‌గ్ర‌త‌, త్యాగాల‌ను చాటుతుంద‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లో దాన్ని త‌క్కువ చేసే ప్ర‌య‌త్నం చేయొద్ద‌ని కాంగ్రెస్ హిత‌వు ప‌లికింది.