భువనేశ్వర్: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం నుంచి లౌకిక, సామ్యవాద పదాలను తొలగిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) అన్నారు. ఒడిశాలో జరిగిన సంవిదాన్ బచావో సమావేశ్ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. దళితులు, గిరిజనులు, ఈ దేశ యువత తమ హక్కుల కోసం బీజేపీ పాలనలో పోరాడాల్సి ఉంటుందన్నారు. ఒడిశాలోని దళితులు, ప్రభుత్వ ఆఫీసర్లపై బీజేపీ మద్దతుదారులు అటాక్ చేస్తున్నారని ఖర్గే ఆరోపించారు. పేదలు, దళితులు, గిరిజనులు తమ హక్కుల కోసం పోరాటం చేయడం నేర్చుకోకుంటే వాళ్లను బీజేపీ తుడిచి వేస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం 160 పీఎస్యూలను ఏర్పాటు చేస్తే, బీజేపీ వాటిల్లో 23ను ప్రైవేటు పరం చేసిందన్నారు.
#WATCH | Odisha | At Samvidhan Bachao Samavesh in Bhubaneswar, Congress chief Mallikarjun Kharge says, “…People of BJP make tall claims today. But their contribution to Odisha is zero. They want to have publicity without doing any work. But we stand with the people of Odisha.… pic.twitter.com/FBaTk1gjpn
— ANI (@ANI) July 11, 2025