న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్పై బీహార్ బీజేపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో పాట్నాలో ఆయనకు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను తేజస్వీ యాదవ్ ఇటీవలే ఖాళీ చేశారు. అయితే ఈ బంగ్లా ఖాళీ చేస్తూ, అందులోని ఖరీదైన ఫర్నిచర్, ఏసీలు, సోఫా సెట్స్, వాష్ బేసీన్లను తేజస్వీ యాదవ్ ఎత్తుకెళ్లారని రాష్ట్ర బీజేపీ మీడియా ఇన్చార్జ్ డానిష్ ఇక్బాల్ ఆరోపణలు గుప్పించారు. ఆ బంగ్లాలోకి తమ బీజేపీ నేత రాబోతున్నందున.. అక్కడికి వెళ్లి చూడగా తామంతా షాక్కు గురయ్యామని, ప్రభుత్వ బంగ్లాలోని సామానంతా లూటీ అయ్యిందని అన్నారు. ఇంతకు ముందున్న తేజస్వీ యాదవ్ ఆ పరికరాల్ని పట్టుకెళ్లారని ఆరోపించారు.