BJD protest : ఒడిశా (Odisha) లో బీజేపీ (BJP) ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష బీజేడీ (BJD) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సందర్భంగా అధికారమే లక్ష్యంగా ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చిన బీజేపీ.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మండిపడింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్నా ప్రభుత్వానికి పట్టడంలేదని, నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం వేయడం ప్రభుత్వానికి చేతగావడం లేదని ఆరోపించింది.
ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బీజేడీ పెద్ద ఎత్తున ఆందోళనకు తెరతీసింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో సోమవారం ప్రతిపక్ష బీజేడీ శ్రేణులు భారీగా గుమిగూడాయి. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు భారీ బహిరంగసభను ఏర్పాటు చేశాయి. ఒడిశాలో బీజేడీ అందోళనకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు..
#WATCH | Bhubaneswar: Biju Janata Dal (BJD) holds a protest against the BJP Government alleging inflation and rising prices of essential commodities in Odisha. pic.twitter.com/6Of8fwUTZv
— ANI (@ANI) January 6, 2025