పాల్ఘర్ : కిలోమీటరున్నర దూరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను తరలించడానికి వారికి 30-45 నిమిషాల సమయం పట్టింది. కనీసం రోడ్డు లేకపోవ డం, వాగులు, బురద, రాళ్లురప్పల మార్గం దాటాల్సి రావడం ఇందుకు కారణం. మార్గమధ్యంలోనే ప్రసవించిన ఆ మహిళ.. తన బిడ్డను కోల్పోయింది. ఈ దారుణ ఘటన బీజేపీపాలిత మహారాష్ట్రలో, సీఎం షిండే ప్రాతినిధ్యం వహిస్తున్న థాణె జిల్లా లో చోటుచేసుకున్నది.
గర్భిణిని బెడ్‌షీట్‌లో ఉంచి వాగు దాటిస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వ్యాప్తి కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామస్థుల వివరాల ప్రకారం.. ఢిగాషి గ్రామానికి చెందిన దశన ఫర్లేకు ఈ నెల 1న ఉదయం పురిటినొప్పులు మొదలయ్యాయి. స్థానికులు వెం టనే ఆమెను బెడ్‌షీట్‌లో పడుకోబెట్టి సమీ ప పీహెచ్సీ తరలించాలని నిర్ణయించారు. రోడ్డు వసతి లేకపోవడంతో బెడ్‌షీట్‌ను అన్ని దిక్కులా పట్టి ఆమెను వాగు, బురద, రాళ్లురప్పల మార్గం దాటించారు. కాసేపట్లో వైద్య కేంద్రానికి చేరుతుందనగా మహిళ ప్రసవించింది. కానీ, శిశువు ప్రాణాలు దక్కలేదు.