రోజూ ఎన్నో రైల్వే ప్రమాదాలను చూస్తుంటాం. కొన్ని రైల్వే ట్రాక్స్ దాటుతుండగా జరుగుతుంటాయి. మరికొన్ని రైలు ఎక్కుతుండగా జరుగుతుంటాయి. ఇంకొన్ని రైల్వే గేటు వద్ద జరుగుతుంటాయి. తాజాగా రైల్వే గేట్ వద్ద జరిగిన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ బైకర్.. రైల్వే గేట్ వేసి ఉన్నా.. ఆవేశపడి.. రైల్వే క్రాసింగ్ గేటును దాటుకొని బైక్ మీద వెళ్తున్నాడు. ఇంతలో రాజధాని ఎక్స్‌ప్రెస్ వేగంగా దూసుకొచ్చింది. ప్రాణాలు పోయే పరిస్థితి. వెంటనే బైక్‌ను అక్కడ వదిలేసి వెనక్కి రాబోయాడు. అంతలోనే ఆ ట్రెయిన్.. తన బైక్‌ను ఢీకొంటూ ఫాస్ట్‌గా వెళ్లిపోయింది. దీంతో బైక్ ముక్కలు ముక్కలుగా అయిపోయింది. మనోడు మాత్రం చిన్న చిన్న గాయాలతో చావు నుంచి తప్పించుకున్నాడు.
నెటిజన్లు మాత్రం ఆ వీడియో చూసి గుర్రుమంటున్నారు. క్రాసింగ్ గేట్ వేసి ఉన్నా.. ఎందుకు ట్రాక్ మీదికి వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు అంటూ సీరియస్ అవుతున్నారు.
#NDTVBeeps | Biker’s Close Shave With Train; Runs for His Life at Last Minute pic.twitter.com/owUtylUYks
— NDTV (@ndtv) February 15, 2022