Biker assaults Bus driver | ఆర్టీసీ బస్సులోకి ఎక్కి డ్రైవర్‌ను కొట్టిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Biker assaults Bus driver | ఒక వ్యక్తి ఆర్టీసీ బస్సులోకి ఎక్కి డ్రైవర్‌పై చేయిచేసుకున్నాడు. అంతటితో ఆగక డ్రైవర్‌ను కిందకు లాగి కొట్టాడు (Biker assaults Bus driver). దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బెంగళూరు: ఒక వ్యక్తి ఆర్టీసీ బస్సులోకి ఎక్కి డ్రైవర్‌పై చేయిచేసుకున్నాడు. అంతటితో ఆగక డ్రైవర్‌ను కిందకు లాగి కొట్టాడు (Biker assaults Bus driver). దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని మైసూర్లో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 10న ఒక వ్యక్తి బైక్‌పై జీఎన్ రోడ్డులో వెళ్తున్నాడు. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ)కు చెందిన బస్సు తన బైక్‌కు తగిలినట్లు ఆరోపించాడు. దీనిపై బస్సు డ్రైవర్‌తో ఘర్షణకు దిగాడు. వాగ్వాదం పెరుగడంతో ఆగ్రహించిన అతడు బస్సులోకి దూసుకెళ్లాడు. డ్రైవర్ చొక్కా కాలర్ పట్టుకుని దాడి చేశాడు. అనంతరం డ్రైవర్‌ను కిందకు లాగాడు. డ్రైవర్‌తోపాటు బస్సు కండక్టర్‌ను కూడా కొట్టాడు. ఇంతలో రోడ్డుపై ఉన్న వ్యక్తులు జోక్యం చేసుకున్నారు. పొట్లాడుకుంటున్న వారిని దూరం చేశారు.
కాగా, ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పబ్లిక్ సర్వెంట్లపై దాడి చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడైన మైసూరుకు చెందిన 30 ఏండ్ల షారుఖ్‌ను అరెస్ట్ చేశారు. మరోవైపు కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- assaults
- biker
- Bus driver
- karnataka
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

