పాట్నా: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు సాయం ప్రకటించింది బీహార్ ప్రభుత్వం. ఈ మేరకు బాల్ సహాయతా యోజనా పేరుతో ఆదివారం ఓ కొత్త పథకాన్ని ప్రారంభించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం ఇవ్వనున్నారు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు కొవిడ్‌తో చనిపోయినా ఈ పథకం వర్తించనుంది. వారి పిల్లలకు 18 ఏళ్ల వయసు వచ్చే వరకూ నెలకు ఈ రూ.1500 సాయం అందించనున్నట్లు నితీష్ ట్వీట్లో వెల్లడించారు.
वैसे बच्चे-बच्चियों जिनके माता पिता दोनो की मृत्यु हो गई, जिनमें कम से कम एक की मृत्यु कोरोना से हुई हो, उनको 'बाल सहायता योजना' अंतर्गत राज्य सरकार द्वारा 18 वर्ष होने तक 1500 रू0 प्रतिमाह दिया जाएगा। (1/2)
— Nitish Kumar (@NitishKumar) May 30, 2021