Bihar Elections : అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నేపథ్యంలో బీహార్ (Bihar) లో నామినేషన్ (Nominations) ల పర్వం మొదలైంది. తొలిదశ పోలింగ్ జరగనున్న స్థానాల్లో పోటీపడుతున్న వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. లఖిసరాయ్ (Lakhisarai) నుంచి బీహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత విజయ్ సిన్హా (Vijay Sinha) నామినేషన్ వేశారు.
నియోజకవర్గంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా విజయ్ సిన్హా వెంట ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, బీహార్ మరో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఉన్నారు. నామినేషన్ అనంతరం రేఖా గుప్తా మాట్లాడుతూ.. బీహార్‌లో ఈసారి కూడా ఎన్డీయే కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు.
నామినేషన్‌కు ముందు విజయ్ సిన్హా మాతా బాలా త్రిపుర సుందరి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెళ్లి నామినేషన్ వేశారు.