పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇక్కడ మూడో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటుచేస్తామని హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్-ఆర్జేడీ, ఎన్డీయే కూటములకు సవాల్ విసురుతున్నారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకుగాను 100 స్థానాల్లో పోటీకి దిగేందుకు ఆ పార్టీ సిద్ధమవుతున్నది.
మజ్లిస్‌తో జతకట్టేందుకు కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి విముఖత వ్యక్తం చేయటంతో తమ ఉనికి చాటేందుకు ఆ పార్టీ సిద్ధమవుతున్నది. రాష్ట్ర రాజకీయాలు గత కొన్నేండ్లుగా ఆర్జేడీ-కాంగ్రెస్ లేదా బీజేపీ-జేడీయూ కూటమి చుట్టూ తిరుగుతున్నాయని, దీనిని తాము మార్చాలనుకుంటున్నట్టు ఒవైసీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీహార్‌లో 100 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు బీహార్ మజ్లిస్ చీఫ్ అక్తారుల్ ఇమాన్ తెలిపారు.