పాట్నా: బీహార్ శాసనసభ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ నేడు (గురువారం) జరుగుతుంది. మొత్తం స్థానాలు 243 కాగా నేడు 121 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై, సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది. నక్సల్ ప్రాబల్య ప్రాంతాల్లో ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.
ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారిలో మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (రఘోపూర్), లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, జనశక్తి జనతాదళ్ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ (మహువా), ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి (తారాపూర్) ఉన్నారు.