PM Modi-Bihar CM Nitish | యూపీలోని అయోధ్య, బీహార్ లోని సీతామర్హి మధ్య కనెక్టివిటీ కోసం కొత్త రైల్వే ప్రాజెక్టు ఆమోదం తెలిపినందుకు ప్రధాని నరేంద్రమోదీకి బీహార్ సీఎం నితీశ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. నర్కాటియాగంజ్-రాక్సౌల్- సీతామర్హి (పునౌరా ధామ్) – ధర్భంగ, సీతామర్హి- ముజఫర్ పూర్ సెక్షన్ల మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ చేస్తూ కేంద్రం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. దీనివల్ల అయోధ్య-సీతామర్హి మధ్య యాత్రికుల ప్రయాణికులకు రైలు కనెక్టివిటీ పెంచడానికి వీలు కలుగుతుంది. దీనిపై నితీశ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ‘ఇది స్వాగతించే నిర్ణయం. అయోధ్య నుంచి సీతాదేవి జన్మస్థలం సీతామర్హి (పునౌరా ధామ్)కు భక్తులు ప్రయాణించడానికి ఈ రైల్వే లైన్ నిర్మాణంతో వెసులుబాటు కలుగుతుంది. ఇందుకు ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నా’ అని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) రూ.6,7,98 కోట్ల అంచనా వ్యయంతో రెండు రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. నర్కాటియాగంజ్-రాక్సౌల్- సీతామర్హి (పునౌరా ధామ్) – ధర్భంగ, సీతామర్హి- ముజఫర్ పూర్ సెక్షన్ల మధ్య 256 కి.మీ పొడవునా రైల్వే లైన్ డబ్లింగ్ చేయాలని సీసీఈఏ నిర్ణయించింది.