పాట్నా, సెప్టెంబర్ 25: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో తిరిగి చేరే ప్రసక్తే లేదని బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ తేల్చిచెప్పారు. ఎన్డీయేలో జేడీయూ తిరిగి చేరుతుందని జరుగుతున్న ప్రచారంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు స్పందించారు. ‘మీరు ఏం మాట్లాడుతున్నారు? అది జరిగే ప్రసక్తే లేదు’ అని నితీశ్ అన్నారు.
పాట్నాలో సోమవారం జరిగిన ఆరెస్సెస్ సిద్ధాంతకర్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమంలో సీఎం నితీశ్‌తో పాటు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ పాల్గొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దీన్‌దయాళ్ జయంతి కార్యక్రమానికి హాజరైన బీజేపీ నేతలు.. ఇప్పుడెందుకు రాలేదని నితీశ్ ప్రశ్నించారు. నితీశ్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. ఆయన వేడుకున్నా ఎన్డీయేలో చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేసింది.