Bihar Caste Survey | బీహార్లో కులాల సర్వే నివేదిక విడుదల.. ఓబీసీలు 63 శాతం, జనరల్ 16 శాతం
Bihar Caste Survey | బీహార్లో నిర్వహించిన కులాల సర్వే (Bihar Caste Survey) నివేదికను సోమవారం విడుదల చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం ఆ రాష్ట్ర జనాభాలో 63 శాతం మంది ఇతర వెనుకబడిన వర్గాల ( ఓబీసీ)లకు చెందిన వారు.
పాట్నా: బీహార్లో నిర్వహించిన కులాల సర్వే (Bihar Caste Survey) నివేదికను సోమవారం విడుదల చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం ఆ రాష్ట్ర జనాభాలో 63 శాతం మంది ఇతర వెనుకబడిన వర్గాల ( ఓబీసీ)లకు చెందిన వారు. 16 శాతం మంది జనరల్ కేటగిరీకి చెందిన వారు. బీహర్ రాష్ట్ర జనాభా 13.1 కోట్లకుపైగా ఉంది. ఇందులో 36 శాతం అత్యంత వెనుకబడిన తరగతులు కాగా, 27.1 శాతం వెనుకబడిన తరగతులకు చెందిన వారు. 19.7 శాతం షెడ్యూల్డ్ కులాలు ( ఎస్సీ), 1.7 శాతం షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) వారు ఉన్నారు. మిగిలిన సాధారణ జనాభా 15.5 శాతం.
కాగా, బీహార్లో నిర్వహించిన కుల ఆధారిత సర్వే ప్రకారం ఆ రాష్ట్ర జనాభాలో దాదాపు మూడింట రెండొంతుల మంది అంటే సుమారు 63.1 శాతం ఓబీసీలు ఉన్నారు. అలాగే ఓబీసీ వర్గాల్లో అత్యధికంగా 14.27 శాతం యాదవ వర్గం వారు ఉన్నారు. మొత్తంగా బీహార్ జనాభాలో ఎక్కువ శాతం ఓబీసీలు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 27 శాతానికి పరిమితమైన ఓబీసీ కోటాను జనాభాకు అనుగుణంగా పెంచాలన్న డిమాండ్ కూడా వినిపిస్తున్నది.
మరోవైపు గాంధీ జయంతి రోజున కుల సర్వే నివేదిక విడుదల పట్ల బీహార్ సీఎం నితీశ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి కుల సర్వే ఫలితాలను వివరిస్తామని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- Caste Survey
- General
- OBC
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

