Bomb Threat : బీహార్ రాజధాని పట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టులో బాంబు కలకలం చెలరేగింది. ఎయిర్పోర్టులో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ చేశారు. ఎయిర్పోర్టు అధికారిక మెయిల్ ఐడీకి ఈ మెయిల్ పంపారు. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్పోర్టు పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
పోలీసులు, బాంబు స్క్వాడ్ అప్రమత్తమై ఎయిర్పోర్టులో తనిఖీలు చేపట్టారు. ఎయిర్పోర్టు పరిసరాల్లో అణువణువూ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పట్నా ఎయిర్పోర్టు డైరెక్టర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఇదిలావుంటే మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.