Milind Deora | మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. షిండే శిబిరానికి మాజీ ఎంపీ..!
Milind Deora | లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ మిలింద్ దియోర కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు.
Milind Deora | ముంబై : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ మిలింద్ దియోర కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోని శివసేన గూటికి చేరేందుకు మిలింద్ సిద్ధమయ్యారు.
మిలింద్ కాంగ్రెస్ కుటుంబానికి చెందిన వ్యక్తి. మిలింద్ సౌత్ ముంబై లోక్‌సభ టికెట్ ఆశిస్తున్నారు. కానీ మిత్రపక్షమైన శివసేన(యూబీటీ) ఆ టికెట్‌ను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేందుకు సుముఖంగా లేదు. సౌత్ ముంబై నుంచి అరవింద్ సావంత్(శివసేన యూబీటీ) లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ట్రేడ్ యూనియన్ లీడర్‌గా ఎదిగి రాజకీయాల్లోకి వచ్చిన అరవింద్ సావంత్.. సౌత్ ముంబై నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ఈ నేపథ్యంలో ఈ టికెట్‌ను కాంగ్రెస్ ఇవ్వడానికి శివసేన అంగీకరించడం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకమైన సౌత్ ముంబై సీటును ఇతర పార్టీలకు కేటాయించేది లేదని అరవింద్ సావంత్ స్పష్టం చేశారు.
అయితే మిలింద్ దియోరా షిండే ఆధ్వర్యంలోని శివసేనలో చేరినప్పటికీ ఆయనకు టికెట్ ఇస్తారనే గ్యారెంటీ లేదు. సౌత్ ముంబై నుంచి బీజేపీ అభ్యర్థి పోటీలో దిగే అవకాశం ఉంది. అయితే మిలింద్కు రాజ్యసభ సీటును సీఎం షిండే ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మురళీ దియోరా కుమారుడే మిలింద్ దియోరా.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

