Harsh Goenka | కొత్త వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఊరట కల్పిస్తూ జీఎస్టీలో కీలక సంస్కరణలు చేపట్టింది (GST Rates). ప్రభుత్వ నిర్ణయంపై పలువురు రాజకీయ, వ్యాపార వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ దివాళీ గిఫ్ట్ అంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ ప్రకటించిన దీపావళి కానుక (Diwali Gift) అద్భుతంగా ఉందంటూ దిగ్గజ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka) కితాబిస్తున్నారు.
‘ప్రతి భారతీయుడికి ఇది అతిపెద్ద దీపావళి కానుక. రోజూవారీ నిత్యావసరాలు, వైద్యం, విద్య, వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గించారు. ఇప్పుడు కిరాణ సామగ్రి చౌక ధరకే లభిస్తుంది. ఆరోగ్య సంరక్షణ ఖర్చు తగ్గుతుంది. విద్య అందుబాటు ధరలో ఉంటుంది. రైతులకు మద్దతు దొరుకుతుంది. మొత్తంగా తదుపరి జీఎస్టీ=జీవన సౌలభ్యం+ఆర్థిక వ్యవస్థకు ఊతం’ అని హర్ష్ గోయెంకా ఎక్స్‌లో పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Big Diwali gift 🎁 for every Indian!
GST on daily essentials, healthcare, education & farming inputs slashed.🛒 Cheaper groceries
💊 Relief in healthcare
📚 Affordable education
🚜 Support for farmersNext-gen GST = ease of living + boost to economy.
— Harsh Goenka (@hvgoenka) September 3, 2025
కొత్త వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న 5, 12, 18, 28 శాతం స్లాబుల్లో 12, 28 శాతం స్లాబులను తీసేశారు. ఈ క్రమంలోనే 12 శాతం జీఎస్టీని ఎదుర్కొంటున్న 99 శాతం వస్తూత్పత్తులను 5 శాతంలోకి, 28 శాతం పన్ను పడుతున్న వాటిలో 90 శాతం వస్తూత్పత్తులను 18 శాతంలోకి తెచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక ప్రత్యేకంగా 40 శాతం స్లాబును ఏర్పాటు చేయగా, ఇందులో 6-7 వస్తూత్పత్తులే ఉంటున్నాయి. వీటిలో పొగాకు, పాన్ మసాలా, లగ్జరీ బైకులు, కార్లు మొదలైన వాటిని ఉంచుతున్నారు. ఈ నెల 22 నుంచి మారిన స్లాబుల ప్రకారం ఆయా వస్తూత్పత్తులపై నూతన పన్ను రేట్లు వర్తించనున్నాయని జీఎస్టీ కౌన్సిల్ భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Also Read..
P Chidambaram | ప్రభుత్వానికి ఎనిమిదేళ్లు పట్టింది.. టూ లేట్.. జీఎస్టీ తగ్గింపుపై చిదంబరం
Shilpa Shetty | కొత్తగా మీ ముందుకొస్తున్నాం.. రెస్టారెంట్ మూసివేతపై క్లారిటీ ఇచ్చిన శిల్పా శెట్టి
వ్యక్తిగత బీమాపై నో జీఎస్టీ.. ఇక 5, 18 శాతం స్లాబులే..