శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 09, 2020 , 12:28:11

భోపాల్‌లో ఆవుపేడ‌తో.. త్రిపుర‌లో వెదురు బొంగుల‌తో దివ్వెలు

భోపాల్‌లో ఆవుపేడ‌తో.. త్రిపుర‌లో వెదురు బొంగుల‌తో దివ్వెలు

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్‌లో స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌కు చెందిన కొంద‌రు మ‌హిళ‌లు ఆవు పేడ‌తో దీపంత‌లు త‌యారు చేస్తున్నారు. దీపావ‌ళి పండుగ నేప‌థ్యంలో వారు ఈ దీపంతల త‌యారీ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఆవు పేడ‌తో దీపంత‌లు త‌యారు చేయ‌డంవ‌ల్ల ఈ మ‌హిళ‌లు ఒక‌వైపు ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు తోడ్ప‌డుతూనే మ‌రోవైపు స్వ‌యం ఉపాధి పొందుతున్నారు. 

కాగా, స్వావ‌లంబ‌న సాధించాల‌న్న ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ పిలుపు మేర‌కు తాము ఈ దీంప‌త‌ల త‌యారీ కార్య‌క్ర‌మాన్ని ఎంచుకున్నామ‌ని మ‌హిళ‌లు తెలిపారు. ప‌ర్యావ‌ర‌ణానికి ముప్పు వాటిల్ల‌కూడ‌ద‌నే ఉద్దేశంతోనే ఆవుపేడ‌తో దీపంత‌లు త‌యారు చేస్తున్నామ‌ని, చాలా త‌క్కువ ధ‌ర‌కే వీటిని విక్ర‌యిస్తున్నామ‌ని చెప్పారు. 


త్రిపుర‌లో వెదురు దీపంత‌లు

దీపావ‌ళి సంద‌ర్భంగా ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం భోపాల్ మ‌హిళ‌లు ఆవు పేడతో దీపంత‌లు త‌యారు చేస్తుండ‌గా.. త్రిపుర‌లోని సెప‌హిజాల జిల్లాకు చెందిన స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌లు మ‌రో కొత్త‌ప‌ద్ధ‌తి ఎంచుకున్నారు. వారు వెదురు బొంగుల‌తో దీపంత‌లు త‌యారు చేస్తున్నారు. వారి కృషిని మెచ్చుకున్న త్రిపుర సీఎం విప్ల‌వ్ కుమార్ దేవ్ స్వ‌యంగా ఆయ‌న చేతుల మీదుగా వెదురు దీపంత‌ల‌ను ఆవిష్క‌రించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.