e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News తెలంగాణ స‌హా 14 రాష్ట్రాల‌కు కొవాగ్జిన్ వ్యాక్సిన్లు.. సుచిత్ర ఎల్లా ట్వీట్‌

తెలంగాణ స‌హా 14 రాష్ట్రాల‌కు కొవాగ్జిన్ వ్యాక్సిన్లు.. సుచిత్ర ఎల్లా ట్వీట్‌

తెలంగాణ స‌హా 14 రాష్ట్రాల‌కు కొవాగ్జిన్ వ్యాక్సిన్లు.. సుచిత్ర ఎల్లా ట్వీట్‌

హైద‌రాబాద్‌: క‌రోనాపై మ‌న హైద‌రాబాద్ కంపెనీ భార‌త్ బ‌యోటెక్ సంధించిన అస్త్రం కొవాగ్జిన్‌. క‌రోనా అన్ని వేరియంట్ల‌పై స‌మ‌ర్థంగా ప‌ని చేస్తున్న ఈ వ్యాక్సిన్‌ను ఇప్పుడా సంస్థ నేరుగా 14 రాష్ట్రాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తోంది. ఈ విష‌యాన్ని ఆ సంస్థ జాయింట్‌ ఎండీ సుచిత్ర ఎల్లా ఓ ట్వీట్‌లో వెల్ల‌డించారు. ఈ 14 రాష్ట్రాల్లో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూడా ఉన్నాయి. ఈ నెల 1 నుంచే కొవాగ్జిన్ టీకాల‌ను రాష్ట్రాల‌కు పంపిస్తున్న‌ట్లు సుచిత్ర ఆ ట్వీట్‌లో తెలిపారు.

కేంద్ర ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చి కేటాయింపుల ఆధారంగా ఈ టీకాల‌ను నేరుగా రాష్ట్రాల‌కు పంపిస్తున్న‌ట్లు చెప్పారు. ఈ నెల 1 నుంచి కింద లిస్ట్‌లో ఉన్న రాష్ట్రాల‌కు కొవాగ్జిన్‌ను నేరుగా పంపిస్తున్న‌ట్లు భార‌త్ బ‌యోటెక్ ధృవీక‌రిస్తోంది. భార‌త ప్ర‌భుత్వం పంపిన కేటాయింపుల ప్ర‌కారం ఈ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఇత‌ర రాష్ట్రాల నుంచి కూడా మాకు అభ్య‌ర్థ‌న‌లు అందాయి. స్టాక్ అందుబాటులో ఉన్న‌దాని ప్ర‌కారం వాళ్ల అభ్య‌ర్థ‌న‌లు కూడా ప‌రిశీలిస్తాం అని ఆమె ట్వీట్ చేశారు. తెలంగాణ‌, ఏపీ కాకుండా అస్సాం, చ‌త్తీస్‌గ‌ఢ్‌, గుజ‌రాత్‌, జ‌మ్ముక‌శ్మీర్‌, జార్ఖండ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఒడిశా, త‌మిళ‌నాడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌ల‌కు ఈ సంస్థ నేరుగా వ్యాక్సిన్లు పంపిస్తోంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణ స‌హా 14 రాష్ట్రాల‌కు కొవాగ్జిన్ వ్యాక్సిన్లు.. సుచిత్ర ఎల్లా ట్వీట్‌

ట్రెండింగ్‌

Advertisement