Bhadrinath temple : ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని శ్రీ బద్రీనాథ్ ఆలయ (Shri Badrinath temple) ద్వారాలు ఈ నెల 4న తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మొత్తం 4000 కిలోల (40 quintals of flowers) పూలతో అలంకరించారు. దాంతో ఆలయం శోభాయమానంగా మెరిసిపోతోంది. భక్తులు పోటీపడి ఫొటోలు తీసుకుంటున్నారు.
కాగా బద్రీనాథ్ ఆలయ ద్వారాలు ప్రతి ఏడాది వేసవి సీజన్లో మే మొదటి వారంలో తెరుచుకుంటాయి. ఈ ఏడాదికి మే 4న భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరువనున్నారు. ఆదివారం ఆలయ ద్వారాలు తెరుచుకోనున్న నేపథ్యంలో శనివారం రంగురంగులతో పూలతో ముస్తాబు చేశారు. ఆలయాన్ని పూలతో అలంకరించిన వీడియోను బద్రీనాథ్ ఆలయ కమిటీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
#WATCH | Uttarakhand | Shri Badrinath temple is being decorated with 40 quintals of flowers, ahead of its opening for devotees in the summer season on May 4
(Video source: Shri Badrinath Temple committee) pic.twitter.com/iRsJqa8yQ4
— ANI (@ANI) May 3, 2025