ఇంట్లోని కుక్కపిల్లను వేరే వాళ్లకు ఇచ్చేయడానికి కుటుంబం నిరాకరిచడంతో.. ఆ తల్లీకూతుళ్లు ఘోరమైన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. దివ్య (36) అనే మహిళకు కుక్కలంటే ఎలర్జీ. కొన్నిరోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆమె వైద్యులను సంప్రదించింది. ఇదంతా ఎలర్జీ వల్లనే జరిగిందని తేల్చిన డాక్టర్లు.. కుక్కలకు దూరంగా ఉండాలని ఆమెకు చెప్పారు.
ఇదే విషయాన్ని భర్తకు చెప్పిన ఆమె.. ఇంట్లోని కుక్కను ఎవరికైనా ఇచ్చేయాలని కోరింది. దీనికి ఆమె అత్తింటి వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో బాధపడిన ఆమె.. ఆరో తరగతి చదువుతున్న కుమార్తె హృద్య (13)తో కలిసి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగంపై దివ్య భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.