Karnataka | కర్ణాటకలో నీటి కొరత మరింత తీవ్రం.. నీళ్లు లేక స్కూళ్లు మూత!
కర్ణాటకలో నీటి కటకట రోజురోజుకూ తీవ్రమవుతున్నది. రాజధా ని బెంగళూరులో నీళ్లు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. స్కూళ్లలో విద్యార్థులకు తాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి ఏర్పడింది. నీటి కొరత వల్ల పాఠశాలలను మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని పాఠశాలలు ఇప్పటికే ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి.
- ప్రైవేటు నీటి ట్యాంకర్ల రేట్లు డబుల్
- కాంగ్రెస్ పాలనలో ప్రజల అష్టకష్టాలు
- వారంలో సమస్య పరిష్కరించాలి
- లేదంటే ఆందోళనకు దిగుతామని విపక్షం హెచ్చరిక
Karnataka | బెంగళూరు, మార్చి 7: కర్ణాటకలో నీటి కటకట రోజురోజుకూ తీవ్రమవుతున్నది. రాజధా ని బెంగళూరులో నీళ్లు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. స్కూళ్లలో విద్యార్థులకు తాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి ఏర్పడింది. నీటి కొరత వల్ల పాఠశాలలను మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని పాఠశాలలు ఇప్పటికే ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బెంగళూరు గొంతెండుతున్నది. నగరంలో రోజుకు 2,600 నుంచి 2,800 ఎంఎల్డీ నీటి అవసరం ఉంటే ఇప్పుడు దాదాపుగా 1,300 ఎంఎల్డీ నీ రు మాత్రమే సరఫరా అవుతున్నది. అంటే, అవసరమైన నీటిలో సగం కూడా సరఫరా జరగడం లేదు. మరోవైపు వేసవి ఇంకా పూర్తిగా ప్రారంభం కాకముందే భూగర్భ జలాలు అడుగంటి, బోర్లు ఎండిపోతున్నాయి.
ప్రైవేటు ట్యాంకర్లే దిక్కు
ఒకవైపు జలమండలి నుంచి నీటి సరఫరా స గానికి సగం తగ్గిపోవడం, మరోవైపు బోర్లు ప ని చేయకపోవడంతో ప్రజలు ప్రైవేటు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. డిమాండ్ ఎక్కువవడంతో ట్యాంకర్ల ధరలు అమాంతం పెంచేశారు. ప్రజల అవసరాన్ని బట్టి డబ్బులు వ సూలు చేస్తున్నారు. ఇంతకుముందు 6,000 లీటర్ల ట్యాంకరుకు రూ.600 ధర ఉంటే ఇ ప్పుడు రూ.1,500కు చేరింది. అది కూడా బుక్ చేసుకున్న 3-4 రోజులకు సరఫరా అవుతున్నది. వెంటనే సరఫరా చేయాలంటే ఒక్కో ట్యాంకర్‌కు 2,000 సమర్పించుకోవాల్సి వస్తున్నది.
7 వేల గ్రామాల్లో నీటి కొరత ?
బెంగళూరుతో పాటు కర్ణాటకలోని వందలాది గ్రామాల్లో తాగునీటికి ఇప్పటికీ తీవ్ర కొరత ఉంది. వేసవి తీవ్రం అవుతున్నా కొద్ది మరిం త నీటి కటకట తప్పదని, దాదాపు 7,000 గ్రామాల్లో తాగు నీటి కొరత రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యాసంస్థల్లో విద్యార్థులకు తాగునీరు కూడా అందడం లేదు. తిన్న తర్వాత చేతులు కడిగేందుకు కూడా నీళ్లు దొరకడం లేదు. దీంతో అనివార్యంగా సెలవులు ఇస్తున్నారు. కొన్ని విద్యా సంస్థలు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తు న్నాయి. నీటి కొరత గురించి నిపుణు లు ముందే హెచ్చరించినప్పటికీ కాంగ్రెస్ ప్రభు త్వం అశ్రద్ధ చేయడంతోనే ఈ పరిస్థితి వ చ్చిందని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఆరోపించారు. వారం రోజుల్లో నీటి కొరతను నివారించాలని ఆయన అల్టిమేటం జారీచేశారు.
విద్యార్థులే ఆన్సర్ షీట్లు తెచ్చుకోవాలట!
న్యూఢిల్లీ, మార్చి 7: తన అస్తవ్యస్త విధానాలతో కర్ణాటక రాష్ర్టాన్ని దివాలా దిశగా తీసుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరో గందరగోళ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి పరీక్షలు రాసే విద్యార్థులు జవాబు పత్రాలను తామే తెచ్చుకోవాలంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర సిలబస్‌ను బోధించే అన్ని పాఠశాలల్లో నిర్వహించే పరీక్షలకు ప్రభుత్వం ప్రశ్న పత్రాలు మాత్రమే ఇస్తుందని, జవాబు రాసే పత్రాలను విద్యార్థులే తెచ్చుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆన్సర్ షీట్లను ముద్రించేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేకే ఈ నిర్ణయం తీసుకుందని విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు.
కొనసాగే అర్హత కాంగ్రెస్‌కు లేదు..
పరీక్షల జవాబు పత్రాలను సైతం విద్యార్థులనే తెచ్చుకోమంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ దివాలకోరు వైఖరిపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తీవ్రంగా ధ్వజమెత్తారు. పూర్తి గందరగోళంలో ఉన్న సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారంలో కొనసాగే అర్హతను కోల్పోయిందని ఆయన అన్నారు. ఆన్సర్ బుక్లెట్ల ప్రింటింగ్ కోసం వెంటనే విద్యాశాఖకు నిధులను అందజేయాలని సీఎంను కోరారు. ఒక ప్రణాళిక, ముందుచూపు లేని ప్రభుత్వం విద్యార్థి లోకాన్ని తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నదని ఆయన ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

