బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో (Bengaluru) రాపిడో (Rapido) బైక్ బుక్ చేసుకున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు వింత అనుభం ఎదురైంది. నిశిత్ పటేల్ (Nishit Patel) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ (Software Engineer) వృత్తి రీత్యా బెంగళూరులో ఓ కుబెర్నెటెస్ గ్రూపునకు సంబంధించిన మీటింగ్‌కు వెళ్లాల్సి ఉంది. అక్కడికి వెళ్లేందుకు రాపిడో బైక్ బుక్ చేసుకున్నాడు. దీంతో నిమిషాల్లో అతనిముందు ఓ బైక్ వచ్చి ఆగింది. అయితే దానిని చూసి ఒక్కసారిగా షాకవ్వడం అంతనివంతయింది. ఎందుకంటే వచ్చింది రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లోనే అత్యంత ఖరీదైన హంటర్ (Royal Enfield Hunter) మోడల్. సరే పోదామని బైక్ ఎక్కిన తర్వాత అతనికి ఇంకో సర్ప్రైసింగ్ విషయం తెలిసింది.
అదేంటంటే ఆ రాపిడో బాయ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే అని. అది అక్కడితో ఆగలేదు. తాను ఏ పనిమీదైతే వెళ్తున్నాడో.. అదే పనిమీద, అక్కడికే అతడు కూడా వెళ్తున్నాడని తెలిసింది. దీంతో రైడర్ నిశిత్ మరింత ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఇలా జీవితమంతా గుర్తుండేలా ఒకేసారి ఎదురైన మూడు అనుభవాలను సోల్మీడియా వేదికైన ఎక్స్‌లో (ట్విట్టర్) రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నది.
గంటల వ్యవధిలోనే 6 వేలకుపైగా మంది దానిని చూశారు. అంతే సంఖ్యలో కామెంట్లూ పెడుతున్నారు. ఈ సైడ్ బిజినెస్ ద్వారా ఎంత సంపాదిస్తున్నాడు కనుక్కోపోయావా అంటూ ఓ వ్యక్తి నిశిత్‌ను ప్రశ్నించాడు.. అరే.. ఈ ఆలోచన అప్పుడు రాలేదు.. దీనిగురించి తెలుసుకోవాల్సి ఉండే అంటూ రిప్లే ఇచ్చాడు. ఇంకొందరు.. ఇందులో కొత్తేముంది? అహ్మదాబాద్‌లో ఐదేండ్ల నుంచే ఓలా, ఊబర్, రాపిడో రైడర్లు రాయల్ ఎన్ఫీల్డ్, హార్లీ డేవిడ్సన్పై కూడా తిరుగుతున్నారు అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టారు.
You won't believe the crazy @peakbengaluru moment I had today! On my way to a Kubernetes meetup, my Rapido captain pulled up on a Royal Enfield Hunter. Turns out he's a DevOps engineer at a company managing enterprise Kubernetes clusters. Just another day in India's tech capital
— Nishit Patel (@nishit130) August 5, 2023