కోల్కతా : తొక్కిసలాట లాంటి ఘటనల వల్ల మహా కుంభ మేళా ‘మృత్యు కుంభ్’గా మారిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంగళవారం ఆ రాష్ట్ర శాసనసభలో వ్యాఖ్యానించారు. తొక్కిసలాట మృతుల సంఖ్యను యూపీ సర్కార్ దాస్తున్నదని ఆమె ఆరోపించారు. ‘వాళ్లు వందలాది మృతుల వివరాలను దాచి పెడుతున్నారు. బీజేపీ పాలనలో మహా కుంభ్ మృత్యు కుంభ్గా మారింది’ అని ఆమె విమర్శించారు. సరైన ఏర్పాట్లు చేయకుండానే కుంభ మేళా గురించి యూపీ ప్రభుత్వం విపరీతంగా ప్రచారం చేసిందని విమర్శించారు. వీఐపీలకు కుంభమేళాలోప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని మమత ఆక్షేపించారు.