Mamata Banerjee | రామనవమి వేడుకలో హింస బీజేపీ గూండాల పనే : దీదీ
పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో శ్రీరామ నవమి వేడుకల్లో తలెత్తిన ఘర్షణలపై సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee ) స్పందించారు.
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో శ్రీరామ నవమి వేడుకల్లో తలెత్తిన ఘర్షణలపై సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee ) స్పందించారు. నెలరోజులుగా అల్లర్లకు బీజేపీ ప్రణాళికలు రూపొందించిందని దీదీ ఆరోపించారు. అదానీ ఉదంతంపై విపక్షాల ప్రశ్నల దాడిని తప్పించుకునేందుకు కాషాయ పార్టీ అల్లర్ల కుట్రకు తెరలేపిందని ఆమె పేర్కొన్నారు.
బెంగాల్‌కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకుండా వివక్ష చూపడాన్ని వ్యతిరేకిస్తూ తాను నిరసనల్లో నిమగ్నమయ్యాయనని, అయితే రామనవమి వేడుకల్లో హింసకు తెగబడిన వారిపై కఠిన చర్యలు చేపడతామని దీదీ స్పష్టం చేశారు. ప్రజలు శాంతియుతంగా వ్యవహరిస్తూ సంయమనం పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. హింసను ముందుగా ఎవరు ప్రేరేపించారనేది ప్రజలకు తెలుసునని అన్నారు. గన్స్, పెట్రోల్ బాంబులను కలిగిఉన్న అల్లరి మూకను బీజేపీ రంగంలోకి దింపిందని దీదీ ఆరోపించారు.
వీరంతా ముందుగా మైనారిటీ వర్గాలపై దాడులకు తెగబడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 31 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. బెంగాల్‌లోని హౌరా జిల్లాలో రామనవమి వేడుకల సందర్భంగా ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో అల్లరి మూకలు పలు వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు దుకాణాలను లూటీ చేశాయి. ఈ ఘటనకు సంబంధించి పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read More
Toll tax | రేపటి నుంచి టోల్ బాదుడు షురూ.. సగటున 4 నుంచి 4.5 శాతం పెంపుదల
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

