Toll tax | రేపటి నుంచి టోల్ బాదుడు షురూ.. సగటున 4 నుంచి 4.5 శాతం పెంపుదల
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు (National Highways), ఎక్స్‌ప్రెస్ వేలపై (Expressways) ప్రయాణం మరింత భారం కానున్నది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్‌ట్యాక్సులు (Toll Tax) పెంచేందుకు జాతీయ రహదారుల అథారిటీ (NHAI) రంగం సిద్ధం చేసింది.
హైదరాబాద్: దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు (National Highways), ఎక్స్‌ప్రెస్ వేలపై (Expressways) ప్రయాణం మరింత భారం కానున్నది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్‌ట్యాక్సులు (Toll Tax) పెంచేందుకు జాతీయ రహదారుల అథారిటీ (NHAI) రంగం సిద్ధం చేసింది. ప్రస్తుత ట్యాక్స్‌పై పెంపుదల సగటున 4 నుంచి 4.5 శాతం వరకు ఉండనుంది. దీంతో సాధారణ ప్రజల రవాణా సాధనమైన బస్సు ప్రయాణం మరింత భారం కానున్నది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలు టోల్ ఫీజులతో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రజల సగటు జీవనం భారంగా మరనుంది. జాతీయ రహదారుల ఫీజు (డిటర్మినేషన్ ఆఫ్ రేట్స్ అండ్ కలక్షన్) నిబంధనలు-2008 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏటా టోల్‌ట్యాక్సుల సవరణ చేపడుతున్నది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా పెరిగిన టోల్ ట్యాక్స్ శనివారం నుంచి (ఏప్రిల్ 1) అమల్లోకి రానుంది.
ప్రతి కిలోమీటర్‌పై రూ.3 పెంపు
గతేడాది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) వివిధ రకాల వాహనాలకు 10-15 శాతం వరకు టోల్ట్యాక్స్ను పెంచింది. ప్రస్తుతం జాతీ య రహదారులపై ప్రతి కిలోమీటర్‌కు అది రూ. 2.19గా ఉన్నది. తాజాగా మళ్లీ పెంచడంతో ప్రతి కిలోమీటరుకు రెండున్నర నుంచి 3 రూపాయల భారం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఉదాహరణకు ప్రస్తుతం హైదరాబాద్ నుంచి నాగపూర్ వరకు రూ.1000 వరకూ టోల్ ట్యాక్స్ వసూలు చేస్తుండగా, పెంపు తరువాత ఇది రూ.1100-1200 వరకు ఉండే అవకాశముందన్నారు.
రాష్ట్రం పరిధిలో వివిధ మార్గాల్లో జాతీయ రహదారులపై 32 టోల్గేట్లు ఉండగా, వాటిపై ప్రస్తుతం రూ.1800 కోట్లకుపైగా టోల్‌ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం గడచిన తొమ్మిదేండ్లలో కేంద్రం టోల్‌చార్జీలను 300 శాతం పెంచడం గమనార్హం. టోల్‌ట్యాక్స్‌లను ఏటా 5 నుంచి 10 శాతం వరకు పెంచుతుండటంతో నిత్యావసర వస్తువుల భారం ఏటేటా పెరుగుతున్నది.
నెలవారీ పాస్‌లపైనా మోత
నెలవారీ పాసులకు పెంపుదల వర్తించనుంది. వీరికి కనిష్టంగా రూ.155 మొదలుకొని గరిష్టంగా రూ.1295 వరకు పెరుగనుంది. వీటి చార్జీలను ఐదు నుంచి ఆరు శాతం పెంచినట్ల స్పష్టమవుతున్నది. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై గరిష్ట టోల్ చార్జి ఉండే కొర్లపహాడ్ వద్ద నెలవారి పాసులపై అదనపు భారాన్ని పరిశీలిస్తే.. జీపు, వ్యాన్ లాంటి లైట్ మోటార్ వాహనాలకు ప్రస్తుతం రూ.4025 ఉంటే అది రూ. 4225కు పెరిగింది. లైట్ కమర్షియల్ వెహికిల్‌కు రూ.6385 నుంచి రూ.6710కు పెరిగింది. బస్ లేదా ట్రక్కు రూ.13240 నుంచి రూ.13910కు, హేవీ వెహికిల్స్‌కు రూ.20,530 నుంచి రూ.21,570వరకు, ఓవర్ సైజ్డ్ వెహికిల్స్‌కు రూ.25,545 నుంచి 26,840 రూపాయలకు నెలవారి పాసుల రుసుము పెరిగింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

